సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్
తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ పీక్స్‌కు చేరింది. డ్రవిడ గడ్డపై ఎన్నికల పరంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దగ్గర విజయ్ (టీవీకే) వెనుకబడటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు విజయోత్సాహం, మరోవైపు అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన పరిస్థితి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పక్షాన…


