పోషక ఆహారం తో సంపూర్ణ ఆరోగ్యం… సూపర్వైజర్ సునీత


విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు,బాలింతలు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం గా ఉంటారని అంగన్వాడి సూపర్వైజర్ సునీత అన్నారు. శనివారం కందుకూరు ప్రాజెక్టు వలే టివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు చెర్లోపాలెం అంగన్వాడి సెంటర్లో పోషణ పక్వాడా పక్షోక్షవాలు కార్యక్రమం కార్యకర్త రమ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్త రమా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా స్కూల్ వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు, సూపర్వైజర్ సునీత హెడ్మాస్టర్ రాజేంద్ర కుమార్ హాజరైనారు ఈ సందర్బంగా సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ ప్రతి గర్భిణీ బాలింత స్త్రీలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు రెండేళ్ల పిల్లలలో మెదడు అభివృద్ధి 80 శాతం ఉంటుందన్నారు పిల్లలకు ఆహారం తీసుకోవడం పట్ల జాగ్రత్త వహించాలన్నారు జంక్ ఫుడ్ ఐస్ క్రీమ్ నూడిల్స్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు ఫోన్ వాడటంలో మెలకువలు పాటించాలన్నారు చిరుధాన్యాలతో ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు పండ్లు తినాలని సూచించారు ఆటపాట్ల ద్వారా పిల్లలకి ఇంట్లో నే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంచాలని అవగాహన కల్పించడం జరిగింది. చిరుధాన్యాలతో ఆహార పదార్థాలను తయారు చేసుకోవాలన్నారు చిరుధాన్యాల్లో మంచి పోషక విలువలు ఉంటాయని చెప్పారు పిల్లలకు జంక్ ఫుడ్ పెట్టవద్దని సూచించారు. స్కూల్ టీచర్ మాట్లాడుతూ మూడు నుండి ఆరు సంవత్సరాల పరిధిలో పిల్లలు ఎదిగే వయసు అని వారిలో మానసిక పరివర్తన పెంచేందుకై ఇళ్లల్లో పెద్దవాళ్లు ఉంటూ పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా వారికి కథలు చెప్పేందుకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందన్నారు జంక్ ఫుడ్ కి దూరంగా ఉంచాలని చెప్పారు. ఎస్సై మరిడి నాయుడు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు సైబర్ నేరాలు కొత్త చట్టాలు మహిళలపై నేరాలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం పోషణ పక్వాడా గురించి ఒక చిన్న ప్రతిజ్ఞ చేయించడం జరిగినది స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఒక ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ సునీత ఎస్ ఐ మరిడి నాయుడు,స్కూల్ హెడ్మాస్టర్ రాజేంద్ర కుమార్, ఉపాధ్యాయులు, ఆశ అంగన్వాడి కార్యకర్తలు రమాదేవి వెంకటేశ్వరమ్మ హైమావతి అంగన్వాడీ హెల్పర్ సరళ గ్రామస్తులుతదితరులు పాల్గొన్నారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *