ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి అండగా నిలవడం గర్వించదగ్గ విషయం..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం రూరల్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా సర్పంచులు గా ఉంటూ, ప్రలోభాలకు…
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ను నియమించారు. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సమర్పించిన రాజీనామాను ట్రస్టు ఆమోదించింది. అదే సమయంలో కొత్త సీఈవో నియామక ప్రక్రియను చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం అయోధ్యలో నిర్వహించిన ట్రస్టు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో సాయంత్రం 3.30…
మా వాటా కోసం అన్ని చర్యలు తీసుకుంటాం: పాక్ ఆర్మీకరాచీ: పాక్ ఆర్మీ కవ్వింపులు మరొక్కసారి బహిర్గతమయ్యాయి. సింధు జలాలు ఆపడంపై ఆ దేశ సైనికాధిపతి ఆసిమ్ మునీర్ తన అక్కసును వెళ్లగక్కారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం సింధు జాలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)ను భారత్ నిలిపివేసిన సంగతి విధితమే. ఐడబ్ల్యూటీని భారత్ పక్కనబెట్టడంతో పాకిస్థాన్ ఇప్పుడు ఉక్కిర్ఙిక్కిరవుతోంది. ఈ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ జలాల వాటాను పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని…
ఎన్‌ఐఏ ఛార్జ్షీట్‌లో హఫీజ్ సయీద్ పేరున్యూదిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాడికి ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబాయే అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్పష్టం చేసింది. ఆధారాలతో సహా చార్జ్‌షీట్‌లో బహిర్గతం చేసింది. ఈ ఘటనలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను ప్రధాన కారకుడుగా పేర్కొంటూ ఎన్‌ఐఏ సోమవారం అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ దాడికి ఉగ్రవాదులను ఆదేశించడం దగ్గర్‌నుంచి…కుట్రకు ప్రణాళిక రూపొందించడం, దాన్ని అమలు చేసేలా…
వెనిజువెలాలో సంభవించిన భారీ భూకంపాల తర్వాత సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు ఇప్పుడు అత్యాధునిక ‘బొద్దింక డ్రోన్ల్ణను (కాక్రోచ్ డ్రోన్లు) వినియోగిస్తున్నాయి. ఇవి మనుషులు చేరుకోలేని ఇరుకైన ప్రదేశాల్లోకీ వెళ్లి బాధితులను గుర్తించగలవు.వెనిజువెలాలో ఇటీవల రెండు భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 3,340 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అయినప్పటికీ సహాయక బృందాలు ఆశ వదల్లేదు. ఇటీవలే…
రావణ్ ఫోన్‌లోని డేటాతో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారని ప్రకాశ్ రాజ్ ఆరోపణఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూర జోసెఫ్) అరెస్ట్ కావడం, కోర్టు ఆయనకు రిమాండ్ విధించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన విడుదల…
నీట్ యూజీ 2026 ఫీజు రిఫండ్‌పై ఎన్‌టీఏ కీలక సూచనబ్యాంక్ వివరాల అప్‌డేట్ కోసం రేపు రాత్రి 11:50 గంటల వరకు గడువని ప్రకటననీట్ యూజీ 2026 పరీక్ష ఫీజు రిఫండ్ ప్రక్రియపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. ఫీజు వాపసు కోసం అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను ధ్రువీకరించుకోవడానికి లేదా అప్‌డేట్ చేయడానికి రేపు (జులై 7) రాత్రి 11:50 గంటలను తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోగా…
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను నిందితుడిగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదనపు చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ దాడి వెనక సరిహద్దు అవతల నుంచి పన్నిన కుట్ర, ఉగ్రవాద సంస్థల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది. జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలైన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో హఫీజ్ సయీద్‌ను వ్యక్తిగత హోదాలోనే…
విశాలాంధ్ర–గోరంట్ల: గోరంట్ల మండలంలోని వానవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని మాచన్నపల్లి గ్రామానికి చెందిన రైతు కమ్మ పెద్ద కిష్టయ్యకు చెందిన జత ఎద్దులు పాముకాటుకు గురై మృతి చెందాయి. ఈ ఘటనతో రైతుకు సుమారు రూ.1.70 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే.. రోజువారీ మాదిరిగానే పశువులను మేత కోసం గ్రామ సమీపంలోని పప్పురోళ్ల బావి వద్ద ఉన్న వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లారు. అక్కడ పశుగ్రాసం మేస్తున్న సమయంలో విషసర్పం కాటేయడంతో రెండు…
ముంబై-పుణే రాకపోకలు బంద్పుణే జిల్లాలో విరిగిపడిన కొండచరియలు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిమహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు పెను విషాదాన్ని సృష్టించాయి. పుణే జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ ఘోర దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరోవైపు, ఈ విపత్తు కారణంగా ముంబై-పుణే మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై నగరానికి భారత వాతావరణ…
– వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు డిమాండ్ విశాలాంధ్ర – పాయకరావుపేట : రైతులకు సకాలంలో నాణ్యమైన వరి విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో లవరాజు కు వినతి పత్రం అందజేశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించి…