విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పాలీసెట్ 2026 హాల్ టికెట్లు విడుదలైనట్లు ఉరవకొండ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఆశ్రఫ్ అలి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి, కార్యదర్శి వెల్లడించిన వివరాల ప్రకారం పాలీసెట్–2026 హాల్ టికెట్లు ఈనెల 18 నుండి డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్– ఈనెల 25 న (శనివారం) ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను రెండు విధానాల్లో పొందవచ్చు. మొదటిగా, 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపడం ద్వారా హాల్ టికెట్‌ను పొందవచ్చు. ఇందుకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబరు లేదా నమోదు చేసిన మొబైల్ నంబరు అవసరం ఉంటుంది. రెండవ విధానంగా, అధికారిక వెబ్‌సైట్ https://polycetap.gov.in� ద్వారా కూడా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబరు లేదా నమోదు చేసిన మొబైల్ నంబరు ఉపయోగించి హాల్ టికెట్‌ను పొందవచ్చు.అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో ఉన్న వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. సరైన హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకురావాలని ప్రిన్సిపల్ సూచించారు.


