దిగ్బంధనం కొనసాగితే…హోర్మూజ్‌ను మూసేస్తాం: ఇరాన్

తెహ్రాన్: ఉద్రిక్తితల నడుమ 47 రోజుల తర్వాత చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో వాణిజ్య నౌకల రవాణాకు అడ్డంకులన్నీ తొలగినట్లు అంతా భావించారు. అయితే, ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం కొనసాగుతుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఉద్రిక్తతలను మరోసారి పెంచింది. ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్. దిగ్బంధనం కొనసాగితే హోర్మూజ్‌ను మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు….

Read More

అమలులోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక మహిళా రిజర్వేషన్ చట్టం 2026 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ 2023లోనే ఆమోదముద్ర పడింది. మూడేళ్ల కిందటే చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని గురువారం (ఏప్రిల్ 16) నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల నాటికే…

Read More

తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు

తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.దూర ప్రాంతాల్లో నివసించే రోగులు చికిత్స కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఃహబ్ అండ్ స్పోక్ః విధానంలో నిర్వహించనున్నారు.హైదరాబాద్‌లోని నిమ్స్,…

Read More

కోత లేకుండనే హార్ట్ వాల్వ్ మార్పిడి

రాయలసీమలో మొట్ట మొదటిది ఓపెన్ సర్జరీ లేకుండా చికిత్స 75 ఏళ్ళ వ్యక్తి ఉపశమనం కలిగించిన కిమ్స్ వైద్యులువిశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఎటువంటి కోత లేకుండా 75 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా గుండె వాల్వ్ మార్పిడి చేసి నూతన జీవితాన్ని అందించారు కిమ్స్ సవీర వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు *సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. మూడే సందీప్. అనంతపురం జిల్లాకు చెందిన ఓ 75 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన ఆయాసం, గుండెలో…

Read More

లోక్ సభలో ఆకట్టుకున్న ప్రియాంకా గాంధీ తొలి ప్రసంగం

21 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సుతిమెత్తగా ప్రభుత్వాన్ని చురకలునెహ్రూ పేరుతో చమత్కారం.. డీలిమిటేషన్ పై ఘాటు హెచ్చరికవయనాడ్ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా తన తొలి ప్రసంగంతో పార్లమెంటును ఆకట్టుకున్నారు. శుక్రవారం 21 నిమిషాల పాటు సాగిన ఆమె ప్రసంగంలో వాగ్ధాటి, వ్యంగ్యం, రాజకీయ చతురత కలగలిసి కనిపించాయి. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేలా చమత్కారాలు విసురుతూనే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సైతం నవ్వించి తనదైన ముద్ర కనబరిచారు. మహిళా రిజర్వేషన్లపై…

Read More

డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గతంలో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత చట్టంలో లేదంటూ తప్పించుకున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో కూడా అదే తీరు పునరావృతమైతే సహించేది లేదని ఆయన తెగేసి చెప్పారు. డీలిమిటేషన్ అనేది దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి తప్ప, ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా మారకూడదని ఆయన…

Read More

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో భారత్ తరఫున అమెరికాలో రాయబారిగా పనిచేసిన సంధు, భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేసిన పోస్టులో వెల్లడించారు. దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తరణ్‌జీత్ సింగ్ సంధుకు అభినందనలు. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా, అమెరికా మాజీ రాయబారిగా భారత్-అమెరికా…

Read More

ఒప్పందం కుదిరితే ఇస్లామాబాద్ వెళ్లేందుకు సిద్ధం

శాంతి చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరితే, దానిపై సంతకం చేసేందుకు తాను పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ చర్చల కోసం వారు నన్ను ఆహ్వానిస్తున్నారు, ఒకవేళ ఇస్లామాబాద్‌లో ఒప్పందం ఖరారైతే నేను తప్పకుండా…

Read More

చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి..నియంత్రణకు RBI కీలక చర్యలు

ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం భారత కరెన్సీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితుల్లో భారత రూపాయి ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఫలితంగా రూపాయి విలువ 3 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. రూపాయి బలహీనత కారణంగా దిగుమతుల ఖర్చులు పెరిగి,ముఖ్యంగా చమురు ధరలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు ఆర్థిక రంగంలో…

Read More

ఘనంగా ఐఎన్‌సీఏ అవార్డుల ప్రదానోత్సవం – Visalaandhra

ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాగచైతన్య హైదరాబాద్: ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముంబయి వేదికైంది. బాలివుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి సినీ వర్గాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తూ.. నిర్వహించిన ఈ ఈవెంట్‌లో చాలామంది సినీ ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్ యాక్టర్ రానా, నటి శ్రియ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా అదరగొట్టారు. ఈ…

Read More