నీటి వృథా అరికట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలి..


– ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్..

విశాలాంధ్ర – నార్పల:- స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ పంచాయతీలలో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్ మాట్లాడుతూ నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాల పెంపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నీటి అనవసర వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ, ఇంకుడు గుంతల ఏర్పాటు ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని సూచించారు. వాడిన నీటిని పెరటి తోటలకు మళ్లించుకోవాలని చెప్పారు.ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఆయన కోరారు.
మండలంలోని అన్ని పంచాయతీల్లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించగా, పంచాయతీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *