క్యాన్సర్ రోగులకు షాక్.. రెండు కీలక మందుల ధరలు 50% పెంపు
దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రెండు కీలక ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది.క్యాన్సర్ రోగులకు అత్యవసరంగా వినియోగించే కార్బోప్లాటిన్ ,సిస్‌ప్లాటిన్ మందుల గరిష్ఠ ధరలను 50శాతం మేర పెంచేందుకు భారత జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.మార్కెట్లో ఈ మందుల కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.ధరల పెంపునకు కారణాలివే..ఈ మందుల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియెంట్స్(API)ధరలు భారీగా పెరగడం,ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం,విదేశీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు…


