పాముకాటుతో జత ఎద్దులు మృతి.. రైతుకు రూ.1.70 లక్షల నష్టం


విశాలాంధ్ర–గోరంట్ల: గోరంట్ల మండలంలోని వానవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని మాచన్నపల్లి గ్రామానికి చెందిన రైతు కమ్మ పెద్ద కిష్టయ్యకు చెందిన జత ఎద్దులు పాముకాటుకు గురై మృతి చెందాయి. ఈ ఘటనతో రైతుకు సుమారు రూ.1.70 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే.. రోజువారీ మాదిరిగానే పశువులను మేత కోసం గ్రామ సమీపంలోని పప్పురోళ్ల బావి వద్ద ఉన్న వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లారు. అక్కడ పశుగ్రాసం మేస్తున్న సమయంలో విషసర్పం కాటేయడంతో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న వానవోలు పశువైద్యాధికారి సంఘటన స్థలానికి చేరుకుని ఎద్దుల మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వ అధికారులు అంచనా వేసి, తగిన పరిహారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత రైతు ప్రభుత్వాన్ని కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *