మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు వెల్లడి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలో కాల్‌మనీ వేధింపులకు గురై దాడికి గురైన బాధితుడు బుర్రా హరికృష్ణ కుటుంబాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం దాడి జరిగిన విషయాలను వారు తెలుసుకున్నారు.అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ సాధారణ ప్రజలను అక్రమ వడ్డీ వ్యాపారులు వేధించడం, బెదిరించడం, దాడులకు పాల్పడడం వంటి చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదన్నారు. ప్రజల కష్టాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులతో మాట్లాడతామని తెలిపారు. వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని వాడు సూచించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించారని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబిలేసు, ప్రకాష్ గౌడ్, డి.చెర్లోపల్లి నారాయణస్వామి, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


