నేత్ర దానం.. ఇద్దరికి కంటిచూపు… – Visalaandhra


రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: మనిషి చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడేవి, దానం చేసే దానికి అర్హమైనవి రెండు కళ్ళు మాత్రమే నని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్. సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచానేత్ర దాన దినోత్సవం పై ప్రజలకు పలు సూచనలను తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చనిపోయిన తర్వాత కళ్ళను దానం చేస్తే, ఆ రెండు కళ్ళను నల్ల గుడ్డుపై పువ్వు పోయి, అందత్వంతో బాధపడే వారికి అమర్చితే ఇద్దరికీ కంటి చూపు వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు. మనిషి చనిపోయిన తర్వాత ఆరు గంటల లోపు రక్త బంధువులు దగ్గరలోని నేత్ర నిధికి గాని, కళ్ళు సేకరించే స్వచ్ఛంద సేవా సంస్థలకు గాని, కళ్ళు సేకరించే కేంద్రమునకు సమాచారాన్ని తెలియజేయాలని తెలిపారు. ప్రస్తుతం కంటిలోని నల్ల గుడ్డుపై ఉన్న తెల్లటి పొరలు మాత్రమే సేకరిస్తున్నారని, కాబట్టి మరణించిన వ్యక్తి ముఖములో ఏమాత్రం మార్పు కాన పడదు అని స్పష్టం చేశారు. స్వీకరించిన కళ్ళను అవసరమైన వారికి ఉచితంగా అమర్చబడుతుందని తెలిపారు. నేత్రదానానికి అన్ని వయసులు వారు అర్హులేనని, చక్కెర వ్యాధిగ్రస్తులు, కంటి శుక్లాం ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా కళ్ళు దానము చేయవచ్చునని తెలిపారు. పచ్చకామర్లు, క్యాన్సర్, పిచ్చికుక్క కాటు వలన మృతి చెందిన వారి కళ్ళు నేత్రదానానికి పనికిరాదు అని తెలిపారు. కాబట్టి ప్రజలందరూ కూడా నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, సమాజాన్ని ప్రోత్సహిస్తే, చూపులేని నిర్భాగ్యుల జీవితాలకు వెలుగును ప్రసాదించిన వారు అవుతారని తెలిపారు. ఆ విధంగా చనిపోయిన తర్వాత కూడా వారి కళ్ళ ద్వారా మరల జీవించవచ్చునని వారు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *