వృద్ధులకు అందని బియ్యం, మూడు రోజులకే మూతపడుతున్న చౌక ధాన్యపు డిపోలు


రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య చైర్మన్, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్
జి. సురేష్ కుమార్

విశాలాంధ్ర ధర్మవరం; నేడు వృద్ధులకు బియ్యము అందడం లేదని మూడు రోజులకే చౌక ధాన్యపు డిపోలు మూతపడుతున్నాయని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య చైర్మన్, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ జి. సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని వినియోగదారుల సమాచార కేంద్రం నందు తంబి చిన్నప్ప అధ్యక్షతన ఏర్పాటుచేసిన వాటికి ముఖ్యఅతిథిగా సురేష్ కుమార్ రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులు నడవలేని 60 సంవత్సరములు పైబడిన వారికి సైతం ఇంటి వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అమలు కావడం లేదని ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఎన్నో చౌక ధాన్యపు డిపోల నందు వృద్ధులు వేలిముద్ర వేయడానికి తంటాలు పడవలసి వస్తుందని అక్కడికి పోతే వేలిముద్ర పడలేదని తిరిగి పంపుతున్నారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా వ్యాప్తంగా కేవలం మూడు నాలుగు రోజులు రేషన్ పంపిణీ చేసి అనంతరం స్టాక్ లేదని త్రిప్పి పంపడం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ డీలర్లలో మార్పు రావడంలేదని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక సివిల్ సప్లై మరియు వినియోగదారుల వ్యవహారాల కోసం ఒక డిప్యూటీ తాసిల్దార్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో తనిఖీల నిర్వహించకపోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వారు స్పష్టం చేశారు.
ప్రతినెల వృద్ధులకు పింఛన్లు ఇచ్చే విధంగా ఆయా స్టోర్ ల నందు వృద్ధులు ఎంతమంది ఉన్నారు అనే సమాచారం కచ్చితంగా సచివాలయ ఉద్యోగుల వద్ద ఉంటుంది కాబట్టి సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్లు వారిని కలుపుకుని మండల వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధుల కు పెన్షన్ ఏ విధంగా అందుతుందో అదే విధంగా రేషన్ కూడా అందేటట్లుగా చూడాలని తెలియజేశారు. చౌక ధాన్యపు డిపో నందు కంప్లైంట్ నంబరు, క్యూఆర్ కోడ్ ప్రజలకు కనపడే విధంగా పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేయాలని తద్వారా ప్రజలకు అందవలసిన రేషన్ కచ్చితంగా అందుతుందని తెలియజేశారు. రేషన్ దుకాణం ఎన్ని రోజులు తీసి ఉంచాలి అన్న దానిపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నతస్థాయి అధికారులు డీలర్లకు ఇవ్వాలని లేనిచో మూడు నాలుగు రోజులకే రేషన్ డిపోను మూసివేస్తారని తెలిపారు.ప్రతి మండలంలోని విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసినట్లయితే చౌక ధాన్యపు డిపోల పర్యవేక్షణ మరియు ప్రజలకు అవగాహన కలిగించేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం మండల వినియోగదారుల సంఘం అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పల్లెం జనార్ధన్ ,ప్రధాన కార్యదర్శి గుర్రం వేణుగోపాల్ క్యాప్కో నారాయణమ్మ, వైస్ ప్రెసిడెంట్ సెల్వరాజ్, బి ఎజన్న, నవీన్ కుమార్, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *