– వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు డిమాండ్
విశాలాంధ్ర – పాయకరావుపేట : రైతులకు సకాలంలో నాణ్యమైన వరి విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో లవరాజు కు వినతి పత్రం అందజేశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించి రైతులకు సేవ చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలు మూసివేశారని, ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ వరి విత్తనాలు 20 శాతం కూడా పంపిణీ కాలేదని, మండల వ్యవసాయ శాఖ అధికారి రైతులకు అందుబాటులో ఉండడం లేదని, ఇన్ పుట్ సబ్సిడీలు లేవని, పంటల నష్టపరిహారం లేదని, వరి విత్తనాలు ఎరువులు లేవని ఆరోపించారు. గత ఏడాది నాణ్యమైన వరి విత్తనాలు పంపిణీ చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎకరాకు 30 నుండి 35 ధాన్యం బస్తాలు దిగుబడి రావాల్సింది, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయకపోవడం వల్ల ఎకరాకు 20 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చిందని తెలిపారు. రైతులకు సరిపడా, సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చిక్కాల రామారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి సూరకాసుల గోవింద్, జిల్లా కార్యదర్శి పడాల గోవింద్, రైతు విభాగం మండల అధ్యక్షులు కొనే పుత్రరావు, జడ్పీటీసీ లంక సూర్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షులు గెడ్డమూరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు ధనిశెట్టి సత్య మహేష్, ఎంపీటీసీ కొంతం నరేష్, ఇసరపు తాతారావు, పన్నీరు పాపారావు, చేపల తాతాజీ, పందిరి ధర్మాజీ, యగదాసు శేఖర్, పల్యాల లక్ష్మణ్ రావు, చిక్కాల సూర్యనారాయణ, యజ్జల సత్యనారాయణ, తిరుమలరాజు నరసింహరాజు, దాడి జగదీష్, వల్లూరి గోవిందరాజులు, త్రిపర్ణ శ్రీను, కర్రి వీరబాబు, తెరపల్లి చంటి, కాకాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


