అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు – Visalaandhra
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఈరోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ కాకినాడకు తరలించారు. ఈ ప్రయాణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతబాబును ఒక్కరోజు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో అనంతబాబును ప్రత్యేక బృందం విచారిస్తోంది. ముఖ్యంగా…


