యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి ధర్మవరం పట్టణంలో యుటిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల్లో దాదాపు 50 శాతం మహిళ ఉపాధ్యాయుల ఉన్నారు అయితే పనిచేసే పాఠశాలలో అనేక చోట్ల కనీస సౌకర్యాలు లేవు లైంగిక వేధింపులు భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవులో వినియోగించడంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కుటుంబ బాధ్యతలు విధి నిర్వహణ రెండిటిని సమన్వయం చేసుకుంటూ శ్రమించి పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సంక్షేమానికి రక్షణకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు,ప్రభుత్వ పాఠశాలలలో మహిళ ఉపాధ్యాయులకు ప్రత్యేక స్టాఫ్ రూమ్ ఏర్పాటు చేయాలి అని,పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక టాయిలెట్స్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలి అని,
మహిళా టీచర్ల భద్రతా నిమిత్తం ఒక ప్రొటెక్షన్ సెల్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలి అని తెలిపారు. అదేవిధంగా
అనారోగ్యం చదువుల నిమిత్తమే కాక పెళ్లయిన బిడ్డలకు తీవ్ర అనారోగ్యం , శాస్త్ర చికిత్స , డెలివరీ సమయాల్లో కూడా వినియోగించే విధంగా చైల్డ్ కేర్ లీవ్ ను మార్పు చేయాలి అని తెలిపారు. తదుపరి మహిళా ఉపాధ్యాయులతో సంతకాల సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి యుటిఎఫ్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి మహిళా సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పి అమర్నాథ్ రెడ్డి, , జిల్లా కార్యదర్శిలు నాగేంద్రమ్మ, లతా దేవి , మహిళ యుటిఎఫ్ నాయకత్వం మణిమాల ,యాస్మిన్ సుల్తాన్ , రామాంజనేయులు వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


