జాతీయ బ్రాండ్ అంబాసిడర్ సోమిశెట్టి సరళకు అరుదైన పురస్కార ఆహ్వానం


విశాలాంధ్ర ధర్మవరం::భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘డిజిటల్ డిస్ట్రిక్ట్ రెపోసిటరీ’ ప్రాజెక్ట్ ముగింపు వేడుకల్లో భాగంగా, ప్రాజెక్ట్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ చారిత్రక పరిశోధకురాలు సోమిశెట్టి సరళకు కేంద్ర ప్రభుత్వం నుండి అరుదైన పురస్కార ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యధికంగా 228 పరిశోధనాత్మక చారిత్రక వ్యాసాలను సమర్పించి రికార్డు సృష్టించినందుకు గాను, జూన్ 25న న్యూఢిల్లీలో జరిగే జాతీయ సదస్సులో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమెకు ఘన సన్మానం, అవార్డు బహూకరణ ఇవ్వనున్నారు.దేశ వ్యాప్తంగా తన తోటి రచయితల తో పాటు గా అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నది. సరళ పుట్టినరోజు నాడే ఈ అధికారిక ఆహ్వానం అందడం విశేషం.కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రత్యేక అనుమతి మేరకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీమతి సోమిశెట్టి సరళతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు ప్రముఖులు ఢిల్లీ వెళుతున్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు నివాసి, 91 ఏళ్ల వృద్ధ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఎద్దుల సూర్యనారాయణ రెడ్డి , విజయవాడకు చెందిన 3 తరాల స్వాతంత్ర్య యోధుల కుటుంబ వారసులు రాంపిళ్ళ జయప్రకాష్ 61 సంవత్సరాలు.ఈ పర్యటనలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ గౌరవాన్ని అందుకోనున్నారు. జాతీయ వేదికపై మన ప్రాంతానికి ఈ గౌరవం దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *