చాలా సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి సుమారు 11:30కి ఆమె దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది…
చాలా పరిచయమైన మధురమైన స్వరం…
ఆమె అడిగింది… 
“ఎలా ఉన్నావు?”
నేను చెప్పాను,
“హ్యాపీ హ్యాపీ… నేను బాగానే ఉన్నాను!” ఎక్కడో మనసులో చిన్న ఉత్సాహం…
ఆమె అడిగింది,
“ఇంకా నిద్రపోలేదా?”
నేను,
“ఇంకా లేదు!” అని చెప్పాను. ఇంకా ఏం మాట్లాడుతుందో వినాలని కుతూహలం నాలో పొడచూపింది
ఆమె అంది,
“ఈరోజు పార్టీ లో నిన్ను చూసాను… చాలా హ్యాండ్సమ్గా కనిపించావు!”
నేను ఆనందంగా,
“థాంక్స్!” అన్నాను.
ఆమె మళ్లీ,
“ఇప్పటికీ నువ్వు అప్పటిలాగే… అదిరిపోయేలా ఉన్నావ్!” అంది.
నేను నవ్వుతూ,
“అవునా!” అన్నాను.
ఆమె చెప్పింది,
“ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు… అందుకే నీతో మాట్లాడాలని అనిపించింది!”
నేను అడిగాను,
“ఏమైంది? ఏమి మాట్లాడాలి?”
ఆమె కొంచెం సంకోచంగా,
“ఒకటి అడగనా? నువ్వు ‘లేదు/కాదు’ అనవు కదా?” అంది.
నేను వెంటనే,
“అదేంటి, అడుగు!” అన్నాను ఆత్రుతగా
ఆమె,
“నాపై ఒట్టు పెట్టు! ఇలా అడుగుతున్నందుకు నువ్వు ఏమీ అనుకోకూడదు..” అంది.
నేను,
“నీ మీద ఒట్టు… చెప్పు!” అన్నాను.
ఆమె సిగ్గుపడుతూ,
“కొంచెం ఇబ్బందిగా ఉంది…” అంది.
నేను,
“అది ఏముంది… చెప్పు!” అన్నాను.
చివరికి ఆమె అడిగింది…
“నీ దగ్గర ఒక ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్ ఉందా?” 
The post వాళ్ళిద్దరూ ఫోన్ లో ఏమి మాట్లాడారంటే..! appeared first on Visalaandhra.


