కోత లేకుండనే హార్ట్ వాల్వ్ మార్పిడి


రాయలసీమలో మొట్ట మొదటిది

  • ఓపెన్ సర్జరీ లేకుండా చికిత్స
  • 75 ఏళ్ళ వ్యక్తి ఉపశమనం కలిగించిన కిమ్స్ వైద్యులు
    విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఎటువంటి కోత లేకుండా 75 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా గుండె వాల్వ్ మార్పిడి చేసి నూతన జీవితాన్ని అందించారు కిమ్స్ సవీర వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు *సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. మూడే సందీప్. అనంతపురం జిల్లాకు చెందిన ఓ 75 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన ఆయాసం, గుండెలో నొప్పి వంటి లక్షణాలతో కిమ్స్ సవీర ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ అతన్ని పరీక్షించిన తర్వాత రోగికి హార్ట్‌లో ఉన్న ప్రధాన వాల్వ్ చాలా కఠినంగా (బిగుసుకుపోయి) ఉండటం వల్ల రక్తం సరిగా వెళ్లలేకపోయింది. అంతేకాకుండా, రక్తనాళం (ఆయార్టా) కొంచెం వంకరగా ఉండటం, లోపల కాల్షియం పేరుకుపోయింది. ఇటువంటి రోగులకు సాంప్రాదాయ పద్దతితో చికిత్స చేయడం చాలా కఠినమైనది అంతేకాకుండా వయసు రీత్య కోలుకోవడం చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితులు కనిపించాయి. దీంతో మేము ఈ శస్త్రచికిత్సలో ప్రత్యేకంగా మెరిళ్ మైవాల్ సిస్టమ్‌ను ఉపయోగించి రోగికి ఎటువంటి కోత లేకుండా విజయంవతంగా చికిత్స అందించడం విశేషం. ఈ ఆధునిక వాల్వ్ ప్లాట్‌ఫామ్‌తో రాయలసీమలో ఇదే తొలి టీఏవీఆర్ ప్రక్రియగా గుర్తింపు పొందింది. టీఏవిఆర్ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చేసే మినిమల్లి ఇన్వేసివ్ విధానం. సాధారణంగా కాలు వద్ద ఉన్న ఫెమోరల్ ఆర్టరీ ద్వారా కాథెటర్‌ను ప్రవేశపెట్టి, దెబ్బతిన్న ఆయార్టిక్ వాల్వ్ స్థానంలో కొత్త వాల్వ్‌ను అమర్చుతారు. ఈ విధానంతో నొప్పి తక్కువగా ఉండటం, రక్తస్రావం తగ్గడం, ఆసుపత్రిలో ఉండే రోజులు తగ్గడం, త్వరగా కోలుకోవడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులకు, అధిక రిస్క్ ఉన్న రోగులకు ఇది ఎంతో ఉపయోగకరం. ఈ చికిత్సలో కార్డియాక్ అనస్తీషియా నిపుణులు డా. అవనీష్, డా. రవి శంకర్, ఇమేజింగ్ నిపుణులు, క్యాథ్ ల్యాబ్ బృందం కీలక పాత్ర పోషించారు. శస్త్రచికిత్స అనంతరం అమర్చిన వాల్వ్ సరిగా పనిచేస్తోంది. రోగిని 48 నుంచి 72 గంటల్లోనే డిశ్చార్జ్ చేయడం జరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *