ఒప్పందం కుదిరితే ఇస్లామాబాద్ వెళ్లేందుకు సిద్ధం


శాంతి చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరితే, దానిపై సంతకం చేసేందుకు తాను పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ చర్చల కోసం వారు నన్ను ఆహ్వానిస్తున్నారు, ఒకవేళ ఇస్లామాబాద్‌లో ఒప్పందం ఖరారైతే నేను తప్పకుండా అక్కడికి వెళ్తాను్ణ అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ నాయకత్వాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. గత రెండు నెలలతో పోలిస్తే ప్రస్తుతం ఇరాన్ చర్చలకు సానుకూలంగా స్పందిస్తోందని ట్రంప్ తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదనేదే తమ ప్రధాన షరతని, ఈ విషయంలో మంచి ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. భూగర్భంలో దాచిన యురేనియం నిల్వలను (న్యూక్లియర్ డస్ట్) వెనక్కి ఇచ్చేందుకు ఇరాన్ అంగీకరించిందని, త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *