ట్రంప్ నిర్వాకం… ఇరాన్ చమురుపై మళ్లీ ఆంక్షలు

పెట్రో ఎగుమతులు నిలిపివేసిన ఇరాన్ వాషింగ్టన్: చమురు మంటలు చల్లారడం లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే ప్రపంచం ఇంధన సంక్షోభంతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్ చమురుపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. తెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ బుధవారం ఆంక్షలను ప్రకటించారు. ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఉన్న ఆంక్షలు ఇటీవల అమెరికా సడలించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపును…

Read More

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

. అందుబాటులోకి 14 వేల సూపర్ స్పెషాల్టీ బెడ్లు. వైద్య విద్యకు మరింత ప్రోత్సాహం. నిరుద్యోగుల ఉపాధి మెరుగుకు స్కిల్ వర్సిటీలు. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో భట్టి విశాలాంధ్ర బ్యూరో ఖమ్మం/ సత్తుపల్లి: ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. “తెలంగాణ మోడల” పాలనను చూసి అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు చదువు, ప్రతి కుటుంబానికి…

Read More

భద్రత కరువు – Visalaandhra

భారతదేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులకు సంబంధించి ఇటీవల విడుదలైన నివేదికలు ఆందోళనకరమైన గణాంకాలను వెల్లడిస్తున్నాయి. నేషనల్ కైమ్ రికార్డ్స్ బ్యూరో (bన్‌సీఆర్‌బీ), జాతీయ మహిళా కమిషన్ (bన్‌సీడబ్ల్యు) నివేదికల ప్రకారం భారత్‌లో మహిళలపై నేరాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ప్రతి గంటకు సగటున 51 మంది మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. 2025 మే నాటికే జాతీయ మహిళా కమిషన్‌కు సుమారు 7,698 ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా…

Read More

పోరాట‌ ప్రతినిధి నాగమణి – Visalaandhra

కోనాల భీమారావు కమ్యూనిస్టు ఉద్యమ గమనంలో కొన్ని జంటలు కేవలం దంపతులుగానే కాకుండా విడదీయలేని ఆశయ బంధాలుగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన, ఆదర్శవంతమైన జంట దివంగత వంక సత్యనారాయణ -నాగమణి జంట. 70 ఏళ్ళ వారి వైవాహిక జీవితంలో ఉద్యమమే ఊపిరిగా, ఆశయమే బాటగా సాగిన వారి ప్రస్థానం నేటి తరానికి ఒక పాఠం. వంక సత్యనారాయణ తన 95వ ఏట 2018లో కన్నుమూయగా వంక నాగమణి తన 95వ ఏటే 2026 ఏప్రిల్ 5న కన్ను…

Read More

రైతు బతుకుపై కల్తీ దాడి – Visalaandhra

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆంధ్రాలో రైతు దుస్థితి అశనిపాతంగా, ఆత్మహత్యా సదృశ్యంగా, అప్ప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది. కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు ముప్పేట పెరిగి రైతు మెడకు ఉరితాడై బిగుస్తున్నాయి. అదునులో సకాలంలో పంట సాగు పెట్టుబడులకు ప్రభుత్వ రుణాలందక, సరైన దిగుబడి వంగడాల సరఫరా లేక, వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కి, బోగస్ విత్తన కంపెనీల మోసాలకు బలై, వాతావరణ వైపరీత్యాల ధాటికి గురై ప్రతి సంవత్సరం రైతు కష్టనష్టాల్లో కన్నీరై…

Read More

నితీశ్ యుగాంతం

రెండు దశాబ్దాల పాటు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న జనతా దళ్ (యు) నాయకుడు నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ నాయకుడు, నితీశ్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌధŠరి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించనున్నారు. అయితే నితీశ్ నుంచి బీజేపీకి అధికారం బదలాయించడానికి దాదాపు నెల రోజులు పట్టింది. మార్చి మొదటి వారంలోనే నితీశ్ కుమార్ తనకు రాజ్యసభ సభ్యుడు కావాలన్న కోరిక ఉందని చెప్పారు. నిజానికి నితీశ్‌ను తప్పించి తమ…

Read More

మహిళా రిజర్వేషన్ మార్గదర్శి

భారత రాజకీయాల్లో మహిళల హక్కుల కోసం అంకితభావంతో పోరాడిన నేతల్లో గీతా ముఖర్జీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. 1996 సెప్టెంబర్ 12న మహిళలకు లోక్‌సభ , రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1996 లో అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేళపెట్టి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ…

Read More

ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కుతున్నారు – Visalaandhra

వెంక గారి భూమయ్య తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేడు సంక్షోభపు అంచున నిలిచింది. హామీల అమలులో మొండిచేయి, బకాయిల చెల్లింపులో మీనమేషాలు లెక్కించడం ఈ రెండూ కలిపి వేలాది మంది కార్మికుల భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేశాయి. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో 45 వేల మంది కార్మికులను రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది కేవలం వేతనాల కోసం చేసే పోరాటం కాదు. ఇది వారి ఉనికిని…

Read More

పేదల కడుపుకొడితే సహిస్తారా? – Visalaandhra

గ్రామీణ ప్రాంత ప్రజానీకం జీవనాడి అయిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎనఆర్‌ఈజీఏ) బలోపేతం చేయడంలో ఘోరంగా విఫలమైన మోదీ ప్రభుత్వం, దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్‌గార్ అజీవికా మిషన్ (జి రామ్ జి) ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి ఉసురు తీసింది. నిస్సిగ్గుగా చేపట్టిన ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల హననమే. కొత్త చట్టం ఉత్తుత్తి చట్టమేమీ కాదు. హక్కులపై ఓ బుల్డోజర్. మహాత్మాగాంధీ పేరు…

Read More

తీర ప్రాంత ప్రజలకు కారిడార్ ముప్ప్పు

గుల్ల కాంతారావు ఒక పని తలపెట్టినప్పుడు దాని పర్యవసానాలను ముందుగానే అంచనా వేయాలి. మంచిచెడులను ఆలోచించాలి. విచక్షణ, సంయమం అనేవి వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా తప్పనిసరి. ఇవి లోపించినప్పుడు, ఆ నిర్ణయాల దుష్పరిణామాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం సహజ వనరుల వినియోగం పేరుతో తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ఇదే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కార్పొరేట్లకు అనుకూలంగా మారుతున్న విధానాల కారణంగా బీచ్ శాండ్ మినరల్స్ తవ్వకాల విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో పెను ముప్పుగా మారే…

Read More