తీరని రైతు గోస! – Visalaandhra

. మైక్రో ఇరిగేషన్‌లో అగ్రగామిగా ఏపీ. అయినా తప్పని తిప్పలు. పరిష్కారం లేని సాంకేతిక సమస్యలు. నిర్వహణ భారంతో అల్లాడుతున్న అన్నదాత విశాలాంధ్ర-సచివాలయం: నవ్యాంధ్రప్రదేశ్ వ్యవసాయ ముఖచిత్రం మారుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.26 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి ఏపీ రికార్డు సృష్టించింది. గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి, రూ. 1030 కోట్ల భారీ సబ్సిడీతో హార్టికల్చర్ హబ్‌గా అవతరించింది. అయితే రైతుల పరిస్థితి పేరు…

Read More

దల్జీత్, జాన్వీలతో కోకోకోలా హాఫ్ టైమ్ క్షణాలు ఆవిష్కరణ

న్యూదిల్లీ: దల్జీత్ దోసాంజ్, జాన్వీ కపూర్‌లతో కూడిన తన ప్రచార కార్యక్రమాన్ని కోక కోలా బుధవారం ప్రకటించింది. ఇది దైనందిన జీవితంలోని క్షణాల్లోకి “కోకకోలా హాఫ్ టైమ” అనే భావనను సజీవంగా తీసుకువస్తుంది. ఈ ఆలోచనకు వ¶లాధారం ఒక నమ్మకం: అదేమిటంటే, ఒక ‘హాఫ్ టైమ’ (విరామ సమయం) కేవలం ఆ రోజు కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం మాత్రమే కాకుండా, మిమ్మల్ని తిరిగి ఆ కార్యకలాపాల్లోకి ఉత్సాహంగా తీసుకువ్లెలా ఉండాలి. కోకాకోలా తన రుచికరమైన, ఉత్తేజకరమైన…

Read More

తాగునీటి సమస్యకు పరిష్కారం…

విశాలాంధ్ర – విడపనకల్లు.. మండల కేంద్రంలోని సుంకులమ్మ గుడి ప్రాంతంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాల మేరకు, వి.కొత్తకోట రస్తా నుంచి సుంకులమ్మ గుడి వరకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.భూమి పూజ అనంతరం జేసీబీ యంత్రంతో పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సత్యబాబు, పంచాయతీ…

Read More

గుంతకల్లు సంత మార్కెట్ లో యాచకుడి మృతి..

గుంతకల్లు (విశాలాంధ్ర):స్థానిక సంత మార్కెట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక షాపు ముందు యాచకుడు మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామాంజనేయులు (67) అనే యాచకుడు ఎండ తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మృతుడు పెద్దవడుగూరు మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందినవాడని తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడి బంధువులు మృతదేహాన్ని స్వగ్రామం గోపరాజుపల్లికి తీసుకువెళ్లినట్లు…

Read More

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందు క్రీడా ప్రాంగాణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు హాకీ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం నారా రామ్మూర్తినాయుడు మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తో కలిసి బ్యాడ్మింటన్…

Read More

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్‌ చేసి తమ రోల్‌ నంబర్‌, స్కూల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, అడ్మిట్‌ కార్డు ఐడీని ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు పొందొచ్చు. అలాగే, డిజీ లాకర్‌ ద్వారా కూడా రిజల్ట్స్‌ తెలుసుకోవచ్చు. పెరిగిన ఉత్తీర్ణత.. బాలికలదే పైచేయిఈ పరీక్షల్లో…

Read More

టీడీపీ పదవుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహ భాగం

*పొలిట్ బ్యూరోలో చంద్రబాబు, దగ్గుమళ్ల ప్రసాదరావు*జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా యువనేత నారా లోకేష్*జాతీయ అధికార ప్రతినిధిగా నీలాయపాళెం విజయకుమార్*రాష్ట్ర కమిటీలో 17మందికి చోటు (విశాలాంధ్ర-తిరుపతి, చిత్తూరు) తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల ఎంపికలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాపై అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాకుండా, అన్ని వర్గాలకు…

Read More

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన శ్రీ చరణ్ తేజ్

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నార్పల మండలానికి చెందిన “ఆంధ్రజ్యోతి” రిపోర్టర్ శంకర్ కుమారుడు శ్రీ చరణ్ తేజ్ ప్రతిభావంతుడిగా నిలిచారు. మొత్తం 1000 మార్కులకు గాను 963 మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేశారు.చిన్నప్పటి నుంచే చదువుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, క్రమబద్ధమైన ప్రణాళికతో సిద్ధమవుతూ వచ్చిన శ్రీ చరణ్ తేజ్ తన కృషితో ఈ విజయాన్ని సాధించారు. ప్రతిరోజూ క్రమశిక్షణతో చదవడం, ఉపాధ్యాయులు సూచించిన…

Read More

లోకేష్‌కు కీలక బాధ్యతలు.. టీడీపీ సంచలన నిర్ణయం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థాపనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన కేంద్ర స్థాయి,రాష్ట్ర స్థాయి,ఉన్నత స్థాయి మండళ్లను అధికారికంగా ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేశ్ఃకు బాధ్యతలు అప్పగించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను కొనసాగించారు. మొత్తం 29 మంది సభ్యులతో ఉన్నత మండలిని ఏర్పాటు చేయగా, 31 మంది సభ్యులతో కేంద్ర కమిటీని నియమించారు.అదేవిధంగా 185 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. కేంద్ర…

Read More

ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు లేదు.. శాశ్వత ఒప్పందమే లక్ష్యం: ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను మరింత కాలం పొడిగించే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేశారు. తాత్కాలిక పరిష్కారాల కంటే శాశ్వత ఒప్పందం సాధించడానికే అమెరికా ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, కాల్పుల విరమణను తిరిగి అమలు చేయకుండానే ఆ చర్చలు ముగిసే అవకాశం ఉందని తెలిపారు. ఒక ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చర్చలు…

Read More