మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు.. డీలిమిటేషన్‌పై వార్నింగ్

దక్షిణాదికి ఇప్పుడున్న 24 శాతం సీట్లు తగ్గకూడదని వార్నింగ్మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన గళాన్ని వినిపించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావులతో నిర్వహించిన భేటీలో జాతీయ రాజకీయ పరిణామాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. గతంలోనే…

Read More

ఆటుపోట్లను ఎదురొడ్డి…ఒక్కసారిగా స్టార్ అయ్యాడు

రైతు కుటుంబంలో పుట్టి క్రికెటర్‌గా ఎదిగిన సకిబ్ హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత ఒక్కసారిగా తళుక్కుమాన్నారు. బంతితో ప్రత్యర్ధి నడ్డి విరిచారు… ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్. తలో నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారకులయ్యారు. ప్రఫుల్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ నడ్డి విరిస్తే… తర్వాత సకిబ్ ప్రత్యర్థి పని పట్టాడు. 4 ఓవర్లలో సకిబ్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి శబాష్ అనిపించుకున్నాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న…

Read More

బెంగాల్‌లో ప్రచార హోరు – Visalaandhra

పరస్పర విమర్శలకు దిగుతోన్న అధికార, విపక్ష నేతలు రాయ్‌గంజ్(కోల్‌కతా): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో పశ్చిమబెంగాల్‌లో ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలో రెడు విడతలుగా 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మొత్తం 2,926 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారని ఈసీ వెల్లడించింది. తొలి దశలో 152 నియోజకవర్గాల్లో 1,478 మంది పోటీ చేస్తున్నారని, రెండో దశలో 142 అసెంబ్లీ స్థానాల నుంచి 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపింది. 13తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది….

Read More

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పుల్లమ్మ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ వీధి కి చెందిన కీ,శే పసుపులేటి పుల్లమ్మ (76 సం ) వృద్ధాప్యం తో మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ….

Read More

చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును…

Read More

శ్రామిక లోకానికి ‘అక్షయపాత్ర’.. బాల్యానికి ‘ఆరోగ్య వనం

​ నేడు రాప్తాడులో అన్నా క్యాంటీన్, చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభం​ పాల్గొననున్న ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇన్చార్జ్ ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రం రాప్తాడు నేడు సరికొత్త అభివృద్ధి హంగులను సంతరించుకోనుంది. నిరుపేదలు, శ్రామిక లోకానికి ఆకలి తీర్చే అక్షయపాత్ర ‘అన్నా క్యాంటీన్’, చిన్నారుల శారీరక దారుఢ్యం కోసం ఏర్పాటు చేసిన ‘పరిటాల రవీంద్ర చిల్డ్రన్స్ పార్క్’ నేడు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత,…

Read More

ముక్కంటి భూములకు రక్షణేదీ..?

*మౌనముద్రలో అధికారులు..*రూ.కోట్లు విలువ చేసే ఆస్తులు పరాధీనం! (విశాలాంధ్ర-శ్రీకాళహస్తి) దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ, రాహు-కేతు పూజలతో స్వామివారికి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నారు. అయితే, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించిన భూములు, ఆస్తుల విషయంలో మాత్రం దేవదాయ శాఖ అధికారులు ఘోర వైఫల్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముక్కంటి ఆస్తులు కళ్లముందే కరిగిపోతున్నా, అన్యాక్రాంతమవుతున్నా అధికారులు మాత్రం మౌనముద్ర వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది. నిర్లక్ష్యం…

Read More

నేరాల నియంత్రణే ధ్యేయం.. సామాన్యుడికి అండగా ఉంటాం

​– అనంతపురం రూరల్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. శ్రీనివాసులు ​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నేరాల నియంత్రణే ధ్యేయంగా పనిచేస్తామని, సామాన్యుడికి అండగా ఉంటామని అనంతపురం రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన రాప్తాడులోని రూరల్ డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఒంగోలులో డీఎస్పీగా పనిచేసి, అక్కడ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. ​ అందుబాటులో పోలీస్ యంత్రాంగం బాధ్యతలు చేపట్టిన…

Read More

వాళ్ళిద్దరూ ఫోన్ లో ఏమి మాట్లాడారంటే..!

చాలా సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి సుమారు 11:30కి ఆమె దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది… చాలా పరిచయమైన మధురమైన స్వరం… ఆమె అడిగింది… “ఎలా ఉన్నావు?”నేను చెప్పాను,“హ్యాపీ హ్యాపీ… నేను బాగానే ఉన్నాను!” ఎక్కడో మనసులో చిన్న ఉత్సాహం… ఆమె అడిగింది,“ఇంకా నిద్రపోలేదా?” నేను,“ఇంకా లేదు!” అని చెప్పాను. ఇంకా ఏం మాట్లాడుతుందో వినాలని కుతూహలం నాలో పొడచూపింది ఆమె అంది,“ఈరోజు పార్టీ లో నిన్ను చూసాను… చాలా హ్యాండ్సమ్‌గా కనిపించావు!” నేను ఆనందంగా,“థాంక్స్!”…

Read More

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య….

విశాలాంధ్ర – కూడేరు..అనంతపురం రూరల్ మండల పరిధిలోని కొడిమి గ్రామ సమీపంలో దళిత రైతు ఎం. గోవిందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చెందినవాడు.గోవిందు తన వ్యవసాయ భూమిలో పంట సాగు చేయడానికి, నీటి బోరు త్రవ్వించేందుకు బయటి వ్యక్తుల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షలకు పైగా అప్పు తీసుకున్నాడు. అయితే బోరులో నీరు పడకపోవడం, పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు మరింత పెరిగాయి. అప్పులపై వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక…

Read More