భారతదేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులకు సంబంధించి ఇటీవల విడుదలైన నివేదికలు ఆందోళనకరమైన గణాంకాలను వెల్లడిస్తున్నాయి. నేషనల్ కైమ్ రికార్డ్స్ బ్యూరో (bన్‌సీఆర్‌బీ), జాతీయ మహిళా కమిషన్ (bన్‌సీడబ్ల్యు) నివేదికల ప్రకారం భారత్‌లో మహిళలపై నేరాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ప్రతి గంటకు సగటున 51 మంది మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. 2025 మే నాటికే జాతీయ మహిళా కమిషన్‌కు సుమారు 7,698 ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ (50% పైగా) నుండి రాగా, ఆ తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ స్థానాల్లో ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న దాడుల్లో ప్రధానంగా గహహింస కీలకమైనది. నమోదవుతున్న కేసుల్లో దాదాపు 31.4% భర్త లేదా అతని బంధువుల ద్వారా జరుగుతున్న వేధింపులే కారణమని తేలింది. లైంగిక దాడులు మరో అంశం. అత్యాచారం, అత్యాచార యత్నాలు మొత్తం నేరాల్లో 7% వరకు ఉన్నాయి. అపహరణ కేసులూ తక్కువేమీ లేవు. సుమారు 19% కేసులు మహిళలు, బాలికల కిడ్నాప్‌లకు సంబంధించినవి. ఇవిగాక, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు, ఈవ్ టీజిం>ù, సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా 24 ఏళ్ల లోపు యువతులు bక్కువగా వేధింపులకు గురవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రాల వారీగా పరిస్థితి చూస్తే, దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై నేరాల రేటు జాతీయ సగటు కంటే రెట్టింపుగా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణలో మహిళలపై నేరాల రేటు bక్కువగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వరకట్న వేధింపులు, గహహింస కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. గతంతో పోలిస్తే మహిళలు తమ హక్కుల పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల, ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే కేసుల సంఖ్య bక్కువగా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే, శిక్షలు పడటంలో జాప్యం తలనొప్పిగా మారింది. ఫిర్యాదులు వేలల్లో అందుతున్నా, నిందితులకు శిక్షలు పడే శాతం (కన్విక్షన్ రేట్) తక్కువగా ఉండటం ఒక ప్రధాన సవాలుగా మారింది. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ‘షీ టీమ్స’, దిశ చట్టం, సఖి వన్ స్టాప్ సెంటర్లు, 112, 181 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇంత జరుగుతున్నా, మహిళల పట్ల దాడులు ఆగడం లేదు. పైగా పెరిగాయని నివేదికలు చెపుతున్నాయి.
202425 సంవత్సరానికి సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (bంహెచఏ) ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, 202425లో మహిళలపై నేరాలు క్రమంగా పెరిగాయని తేలింది. మహిళలపై 2020లో 3,71,503 ఘటనలు, 2021లో 4,28,278, 2022లో 4,45,278 నేరాలు నమోదయ్యాయి. ఇందులో మెజారిటీ నేరాలు భర్తలు, వారి కుటుంబ సభ్యుల నుంచి జరిగే హింస (31.4 శాతం)కు సంబంధించినవే కావడం గమనార్హం. ఆ తర్వాత స్థానంలో మహిళల కిడ్నాప్ లేదా అపహరణ (19.2 శాతం), స్త్రీ మర్యాదకు భంగం కలిగించే ఉద్దేశంతో ఆమెపై దాడి (18.7 శాతం), లైంగిక దాడులు (7.1 శాతం) వంటి నేరాలు ఉన్నాయి. చాలామంది మహిళలు హత్య, దొంగతనం, మోసాలకు బాధితులుగా ఉన్నారు. 2020 నుంచి 2021 వరకు మహిళలపై నేరాలు 15 శాతం పెరగగా, 2021 నుంచి 2022 వరకు 4 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2022 నాటికి ఒక లక్ష మంది మహిళా జనాభాకు గాను మొత్తం నేరాల రేటు 66.4 శాతంగా ఉంది. అయితే ఇటువంటి నేరాలకు సంబంధించి bఫఐఆర్‌లను నమోదు చేయడాన్ని పోలీసులకు తప్పనిసరి చేయడం, పోలీసు సిబ్బందిలో అవగాహన పెంచడం, విస్తత అవగాహన కార్యక్రమాలు వంటి చర్యలు కారణంగా ఈ నేరాల నమోదులో పెరుగుదల ధోరణి ప్రధానంగా కన్పిస్తోందని bంహెచఏ వివరించింది. ఇక చిన్నారులపై నేరాల విషయంలోనూ ఇదే దోరణి కన్పిస్తోంది. 2020 నుంచి 2022 మధ్య పిల్లలపై నేరాలు పెరిగాయి. 2020లో వీటి సంఖ్య 1,28,531 కాగా, అది 2021 నాటికి 1,49,404గా, 2022 నాటికి 1,62,449గా నమోదయ్యాయి. వీటిలో అత్యధిక నేరాల వాటా కిడ్నాప్ లేదా అపహరణ (45.7 శాతం) నేరాలదే కావడం విశేషం. పోక్సో చట్టం కింద 39 శాతం కేసులు నమోదయ్యాయి. ‘జువైనల్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్ విత్ లా’ కింద 30,555 కేసులలో 37,780 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు హోం శాఖ ప్రకటించింది. ఏదేమైనప్పటికీ, పెరుగుతున్న నేరాల నేపథ్యంలో మహిళలకు భద్రత కరువైందన్న విషయం రూఢి అయింది. మహిళలపై నేరాలు bక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దేశంలోనే అత్యధికంగా మహిళలపై నేరాలు ఉత్తరప్రదేశ్‌లోనే నమోదవుతున్నాయి. జాతీయ మహిళా కమిషన్ (bన్‌డబ్ల్యుసీ)కి వచ్చే ఫిర్యాదులలో సగానికి పైగా (సుమారు 54%) ఈ రాష్ట్రం నుంచేû ఉంటున్నాయి. అత్యాచార కేసులు, లైంగిక దాడుల విషయంలో రాజస్థాన్ రాష్ట్రం తరచుగా మొదటి స్థానాల్లో ఉంటోంది. మహిళలపై దాడులు, కిడ్నాప్ కేసులలో మహారాష్ట్ర రాష్ట్రం ముందంజలో ఉంది. గహహింస, మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు ఇక్కడ bక్కువగా నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య కంటే ‘నేరాల రేటు’ (ప్రతి లక్ష మంది మహిళలకు జరిగే నేరాలు) ప్రామాణికంగా తీసుకుంటే ఢిల్లీ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా ఉంది. ఇక్కడ జాతీయ సగటు కంటే నేరాల రేటు చాలా రెట్లు bక్కువగా ఉంది. ఆ తర్వాత హర్యానా, తెలంగాణ రాష్ట్రాలు కూడా అధిక నేరాల రేటును కలిగి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై నేరాల నమోదు గత కొన్ని ఏళ్లుగా పెరుగుతూ వస్తోంది. ద¿ాìణ భారతదేశంలోని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మహిళలపై నేరాల రేటు bక్కువగా ఉంది. హైదరాబాద్ రాజధాని నగరంలో మహిళల భద్రత కోసం ‘షీ టీమ్స’ వంటి పటిష్టమైన చర్యలు ఉన్నప్పటికీ, గహహింస, సైబర్ వేధింపుల కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి.
విచిత్రమేమిటంటే, రాష్ట్రంలో మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తుండటం వల్ల కేసుల సంఖ్య bక్కువగా కనిపిస్తోందని పోలీస్ యంత్రాంగం పేర్కొంటోంది. గతంలో మహిళలు bన్ని వేధింపులకు గురైనా, వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు ఇవ్వకపోవడం వల్ల నేరాలు తక్కువగా కన్పించేవని మహిళా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ‘భర్త లేదా బంధువుల ద్వారా వేధింపులు’ (గహహింస) కేసులు అత్యధికంగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం, యాప్ ద్వారా వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీనివల్ల వేగంగా స్పందించే అవకాశం కలిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి తకూడా వరకట్న వేధింపుల కేసులు ఇక్కడ ఆందోళనకరంగానే ఉన్నాయి. నేరాల సంఖ్య పెరగడానికి ఒక కారణం మహిళల్లో అవగాహన పెరిగి, వారు పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు పెట్టడమే. అయితే, మహిళలపై జరుగుతున్న దాడుల తీవ్రత తగ్గడానికి మరింత కఠినమైన శిక్షలు, వేగవంతమైన న్యాయ విచారణ అవసరమని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు.


