డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గతంలో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత చట్టంలో లేదంటూ తప్పించుకున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో కూడా అదే తీరు పునరావృతమైతే సహించేది లేదని ఆయన తెగేసి చెప్పారు. డీలిమిటేషన్ అనేది దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి తప్ప, ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా మారకూడదని ఆయన…


