Leopard Panic in Chittoor | చిత్తూరులో చిరుత కలకలం..!



చిత్తూరు నగర నడిబొడ్డున చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. నగరానికి సమీపంలోని దొడ్డిపల్లి ప్రాంతంలోని జగనన్న లేఔట్లో గత మూడు రోజులుగా చిరుత పులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నివాస ప్రాంతంలో చిరుత పులి కనిపించడం వల్ల ప్రజలు ఇళ్ల బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరుత సంచారం సమాచారం బయటకు రావడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.#Chittoor #Leopard #LeopardSighted



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *