Summer Health Tips: వేసవి కాలం వస్తే మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య శరీరానికి ఎక్కువగా చెమట పట్టడం. వేసవి తీవ్రత, ఉక్కపోతతో పాటు శరీరం త్వరగా డీహైడ్రెట్ కావడం వల్ల చంకల్లో, వీపుపైన, ఛాతిపైన , తలపై కూడా చెమట పడుతూ ఉంటుంది. మన చుట్టూ రెండు రకాల వ్యక్తులను మనం చూస్తుంటాము. కొందరికి ఫ్యాన్ వేసినా కూడా విపరీతంగా చెమట పడుతుంది, మరికొందరికి అస్సలు చెమట పట్టదు. నిరంతరం చలిగా అనిపిస్తుంది.



