శత వసంతాల సరస్వతీ నిలయం – Visalaandhra


భైరవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగిసిన శతాబ్ధి వేడుకలు
స్ఫూర్తి నింపిన పూర్వ విద్యార్థుల సందేశాలు
అలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

విశాలాంధ్ర-విజయవాడ: సరస్వతీ నిలయంలో శత వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహాయ సహకారాలతో మూడు రోజుల పాటు నిర్వహించిన శతాబ్ధి వేడుకలు గురువారం ముగిశాయి. 1926, బ్రిటీష్ పాలనలో ఏలూరు జిల్లా (పూర్వపు కష్ణా) మండవల్లి మండలం భైరవపట్నంలో మండల పరిషత్ పాఠశాలగా అంకురార్పణ జరిగింది. దినదిన పరివర్తనతో నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా గణితికెక్కింది. వందేళ్లు విద్యా పరిమళాలు వెదజల్లుతూ ఎందరో విద్యావేత్తలను సమాజానికి అందిస్తూ చరిత్ర సృష్టిస్తున్నపాఠశాల చదువుల గుడిగా ఆంధ్ర రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు గడించింది. విలువలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఎందరో నిరుపేద విద్యార్థులకు అక్షరజ్ఞానం అందిస్తూ సైంటిస్టులుగాను, ప్రొఫెసర్లు, ఇంజినీర్లు, పోలీసు ఉన్నతాధికారులు, విద్యా బోధకులుగాను తీర్చిద్దింది. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పాఠశాలగా నిలిచింది. విద్యా ప్రమాణాలకు సాక్షీభూతంగా నిలుస్తూ రాష్ట్రంలోనే అత్యున్నతమైన విద్యానిలయంగా వెలుగొందుతోంది. విద్యా వెలుగులు విరజిమ్ముతూ చిన్నారుల్లో చీకటిని పారద్రోలుతూ అక్షరజ్ఞానాన్ని జొప్పించి నేటికీ ఉత్తమమైన విద్యార్థులను సమాజానికి అందిస్తోంది. అంతటి ఘన చరిత్ర కలిగిన పాఠశాల… ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేస్తూ నేడు ఎందరినో మేధావులుగా తీర్చిదిద్దుతూ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కత్తిమీద సాముగా మారినా గ్రామస్థులు వెన్నుదన్నుగా నిలుస్తుండడంతో విద్యాసంబంధిత వస్తువులన్నింటినీ సమకూర్చుకుని ప్రత్యేకతను చాటుకుంది. గురువులు గురుతర బాధ్యతను గుర్తెరిగేలా పిల్లలకు అక్షర బోధనచేస్తూ నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు ఎన్‌వీ బాలసుబ్రమణ్యం, ఉత్తమ ఉపాధ్యాయులు గోలుకొండ సముద్రుడు, బి.శారదారాణి, వి.వెంకట రాజారావు, బి.శిరీష, ఎన్.మల్లేశ్వరరావు, డి.వెంకటేశ్వరరావు, టి.రామ్మోహన్, పి.సుబ్బారావు, జి.శ్యామల, బీజేఎస్ కమలకుమారి, సీహెచ్‌వీఎస్ లక్ష్మీశకుంతల, ఎం.జయలక్ష్మి… విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తీరుకు గ్రామస్థులు సంభ్రమాశ్చర్యాలలో మునిగితేలుతున్నారు. విద్యల పూదోటగా పేరుగాంచిన భైరవపట్నం పాఠశాల 2026, ఏప్రిల్ నాటికి నూరేళ్లు పూర్తి చేసుకుని శతాబ్ధి వేడుకలకు ముస్తాబై తొలిరోజైన మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. బుధవారం జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఎందరో తమ చదువుల గుడిని కీర్తిస్తూ తాము ఎలా ప్రయోజకులమైందీ వివరిస్తుంటే గ్రామస్థుల నుంచి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. చివరి రోజైన గురువారం సాంస్కతిక ప్రదర్శనలు అదరహో అనిపించాయి. చిన్నారులు తమ ఆటపాటలతో అలరించారు. నాట్య ప్రదర్శనలతో ఆహుతులను కట్టిపడేశారు. సంప్రదాయ నత్యాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తొలుత ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తమ అమూల్యమైన సందేశాన్నిచ్చారు. అతిథులుగా పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు చాపరాల దుర్గాప్రసాద్, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు చదలవాడ శేషగిరిరావు, మాజీ సర్పంచ్ చదలవాడ శ్రీమన్నారాయణ, ప్రముఖ దాత గాధిరాజు భాస్కరవర్మ, నీటిసంఘం మాజీ అధ్యక్షుడు బొల్లింపల్లి కష్ణారావు, అబ్దుల్ కలాం ప్రియశిష్యుడు పర్వతనేని బాపయ్య, ఎస్ఎంసి కో ఆప్టెడ్ మెంబర్ సజ్జా సురేశ్‌బాబు, విద్యా కమిటీ చైర్మన్ కటికల సాలురాజు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *