9 గంటలకు తమిళనాడులో 17.69, బెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదు
చెన్నై/ కోల్‌కతా: తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తొలివిడతలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ నడుస్తుండగా… తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు తమిళనాడులో 17.69 శాతం, పశ్చిమబెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదైంది.
తమిళనాడు ఓటింగ్‌లో పాల్గొన్న ప్రముఖులు…
తమిళనాడులో తొమ్మిది లోపే ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శివగంగ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఓటేశారు. టీవీకే చీఫ్ విజయ్ చెన్నైలో ఓటేశారు. ఆయన తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ నుంచి పోటీలో ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్, వారి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో ఓటేశారు. బీజేపీ నేత ఖుష్బూ, నటి త్రిష ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఎనఎం చీఫ్, ప్రముఖ నటుడు కమల్‌హాసన్, ఆయన కుమార్తె శ్రుతి హాసన్ చెన్నైలో ఓటేశారు. మరో ప్రముఖ నటుడు రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దక్షిణ చెన్నైలోని తిరువన్మయుర్‌లో అజిత్ ఓటేశారు.
The post ప్రశాంతంగా సాగుతోన్న రెండు రాస్ట్రాల ఎన్నికలు… appeared first on Visalaandhra.


