నియోజకవర్గ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఇంచార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో గల ఓటర్ల జాబితాను ఇన్చార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21/4/2026 నాటికి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో పురుషులు 1,22,706 మంది, స్త్రీలు 1,25,285 మంది, ఇతరులు 21 మంది కలిసి మొత్తం 2,48,012 ఓటర్లు కలరు అని తెలిపారు. ధర్మవరం అర్బన్ లో పురుషులు 52, 386 మంది, స్త్రీలు 54, 049, ఇతరులు…


