కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు దురదుష్టకరం


అవినీతి జరిగిందా..? లేదా.. ఎవరు తేల్చాలి..?

విశాలాంధ్ర‌, హైద‌రాబాద్ : దేశంలో జరుగుతున్న రాజకీయ అవినీతిపై జరుగుతున్న ప్రచారం, కోర్టు తీర్పులు, రాజకీయ ప్రభావంతో అంతిమంగా రాజకీయ, ఆర్ధిక నేరగాళ్ళకు కేసుల నుండి తప్పించుకునే అవకాశం ఏర్పడుతుందని, దీనివల్ల రాజకీయ నాయకులు రాజకీయాలలో మరింత ప్రభావం పెంచుకుంటున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.యస్.బోస్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఒక రాజకీయ నాయకుడిపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని విపరీతమైన ప్రచారం జరిగింది. అదే వ్యక్తి ప్రస్తుత రాజకీయాల్లో ప్రక్కనున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై 5 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎఫ్‌డిఆర్ (ఫోరం ఫర్ డెమోక్రటీ రైస్)కు చెందిన ప్రముఖులు ప్రతి ఎన్నికలలో ప్రజా ప్రతినిధులుగా నిలబడే వారిలో ఏ పార్టీలో ఎంతమంది ఆర్ధిక నేరగాళ్ళు, ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో పరిశీలించి ప్రజల ముందు ఉంచుతున్నారు. కానీ అలాంటి నేరగాల్లే ఎన్నికలలో గెలిచి మరిన్ని నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఏకసభ్య కమీషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమీషన్ సభ్యుడు సుప్రీం కోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టీస్ పి.డి.ఘోష్ ఆయన ఇచ్చిన తీర్పును ప్రస్తుత రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చెల్లదని చెప్పటంలో న్యాయం ఎంత..?. ఈ విషయంలో సిబిఐ కూడా ముందుకు వెళ్ళవద్దని చెప్పినట్లుగా వార్తల ద్వారా తెలుస్తున్నది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా అని ఎవరు చెప్పాలి? ఆ విషయాన్ని ఎవరు తేల్చాలి? ఇలాంటి అవినీతి విషయాల్లో అసలు ఎలా వెలుగుచూస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోర్టు తీర్పులలో న్యాయం ఎంత, రాజకీయ ప్రభావం ఎంత అనేది ప్రజలకు అర్ధంకాని పరిస్థితిలో ఉన్నారు. ఏది నిజమో, ఏది అబద్దమో తెలియక ప్రజలు నిరాశకు గురవుతున్నారు. వ్యవస్థýపై నమ్మకాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ముందు ముందు తిరుగుబాటుకు సంకేతాలుగా భావించాలి. అవినీతి రాజకీయాలను ఇంకా ఎంతకాలం భరించాలి. వీటిని ప్రక్షాళన చేయవల్సిన తక్షణ అవసరం ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పాలకుల అవినీతి ఉందా, లేదా, ఉంటే ఎంత?, ఎవరి బాధ్యులు? అనేది తేలేసరికి తరాలు మారిపోతాయి. దీనికి ప్రజలు సిద్ధంగా లేరు. తెలంగాణాలో 2014 నుండి రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ప్రకటించిన ఆర్ధిక, పరిస్థితులు ఎన్నికైన తర్వాత పెరిగిన ఆస్తిని గుర్తించి అదనపు ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వం జాతీయం చేయాలి. అవసరమైతే దానికి కావాల్సిన చట్టాలు తీసుకురావాలి. అవినీతిని వ్యతిరేకించే పార్టీలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఇలాంటి చట్టాన్ని ఆమోదించి అమలు చేయటానికి పూర్తిగా సహకరించాలి. ఇలాంటి అవినీతి ప్రక్షాళన ప్రక్రియ ఇప్ప్పుడే మొదలు పెట్టాలి. భవిష్యత్తులోను కొనసాగించాలి. అప్ప్పుడే ఎంతోకొంత అవినీతి రాజకీయాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఏర్పడుతుంది. అవినీతి రాజకీయాలను మట్టుపెట్టటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *