Last Updated:
Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే ఇంటి యజమాని మానసిక పరిస్థితి బాగోకపోతే కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడానికి తిరుపతిలో జరిగిన ఓ దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది.
Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే ఇంటి యజమాని మానసిక పరిస్థితి బాగోకపోతే కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడానికి తిరుపతిలో జరిగిన ఓ దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఇందులో నలుగుర్ని ఇంటి పెద్దగా వ్యవహరిస్తున్న వ్యక్తి చంపేయడం అటుపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం చూసి అతని బంధువులే కాదు పోలీసులు, స్థానికులను తీవ్రంగా కలచివేసింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకి చెందిన మోహన్ కన్నతల్లిని కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లల్ని చంపేశాడు. అసలు ఇంతటి దారుణం జరగడానికి కారణాలు ఏమై ఉంటాయని పోలీసులు విచారిస్తున్నారు.
కుటుంబంలో కష్టాలు, సమస్యలు మొదట సాలెగూడు పోగుల్లా మొదలై.. చివరకు మర్రిచెట్టు ఊడల్లా మారి ఆ కుటుంబంలోని వ్యక్తుల ప్రాణాలకు ఉరితాడుగా మారతాయి. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణ పాలెం (వి.కె.పాలెం)లో జరిగిన అత్యంత విషాదకర సంఘటన ఇందుకు సజీవ సాక్షంగా నిలిచింది. ఈ ఘటనలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురి మృతి ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
వెంకటకృష్ణపాలెం చాకలి వీధిలో ఉంటున్న మోహన్ ఓ సిమెంట్ వ్యాపారం చేస్తుండగా అతని భార్య హరిత టైలరింగ్ షాప్ నడుపుతోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. 15ఏళ్ల హరిణి, 14 సంవత్సరాల కౌశిక్ ఇద్దరూ పుత్తూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. మోహన్ తల్లి చంద్రకళ ఈ దంపతులుతో కలిసి జీవిస్తోంది. మొత్తం ఐదుగురు ఒకేచోట నివసిస్తున్నారు. అయితే బుధవారం ఉదయం ఇంట్లో జరిగిన చిన్న గొడవతో మోహన్ కోపంతో తల్లి చంద్రకళ, భార్య హరితను చున్నీతో గొంతుకు చుట్టేసి చంపేశాడు.
అటుపై పిల్లలు చదువుకుంటున్న స్కూల్‌కి వెళ్లి తన మామ చనిపోయాడని పిల్లల్ని స్కూల్ నుంచి మధ్యలోనే తీసుకొచ్చాడు. బైక్ పై ఇద్దరిని తిరుపతి జిల్లా వేపగుంట రైల్వే స్టేషన్ కి తీసుకొచ్చాడు. రాత్రి 7.30 నిమిషాల సమయంలో ఇద్దరు పిల్లల్ని రైలు పట్టాలపై నెట్టేసి హత్య చేశాడు. అటుపై మోహన్ కూడా రైలు పట్టాలపై తలపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం ఇంటికి వెళ్లి భోజనం తెస్తానని చెప్పిన మోహన్ షాపుకి రాకపోవడంతో ఇంటికి వెళ్లి చూశాడు. అప్పటికే తన సోదరి హరిత, అత్త చంద్రకళ విగతజీవులుగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే మోహన్ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే మోహన్ భార్య, తల్లిని ఎందుకు చంపాడని ఆరా తీసేలోపే పిల్లల్ని చంపి తాను చనిపోయాడని తెలిసి షాక్ అయ్యారు. వీరి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే ఇంతటి దారుణ సంఘటనకి అసలు కారణం ఏమై ఉండవచ్చని విచారించిన పోలీసులు షాకింగ్ నిజాలు తెలిశాయి. మోహన్ మానసిక స్థితి అదుపుతప్పిందని అనుమానిస్తున్నారు.మోహన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. గత కొంతకాలంగా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.
బుధవారం ఉదయం ఇంట్లో జరిగిన చిన్న గొడవతో అతని మానసిక స్థితి అదుపుతప్పిందని అనుమానిస్తున్నారు. ఆ ఉన్మాద స్థితిలోనే కన్నతల్లి చంద్రకళను, భార్య హరితను చున్నీతో గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది.తర్వాత తన ఇద్దరు పిల్లలు హరిణి, కౌశిక్‌ను స్కూల్ నుంచి తీసుకువచ్చి రోజంతా తనతో ఉంచుకొని రాత్రి వేళ వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రాగానే వారిని రైలు కిందకు తోసేశాడు.
అనంతరం తాను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది.
అయితే ఈకేసులో మోహన్ మానసిక అనారోగ్యానికి సంబంధించిన చికిత్స సక్రమంగా కొనసాగిందా లేదా అనే సందేహాలున్నాయి. కుటుంబ సభ్యులు పర్యవేక్షణలో లోపం జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను చూసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tirupati,Chittoor,Andhra Pradesh



