లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో 80 మంది కంటి రోగులు పాల్గొనగా, వారికి కంటి వైద్యులు వైద్య చికిత్సలు అందించిన తర్వాత 35 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. వీరందరికీ ఉచిత ఆపరేషన్తో పాటు ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఆపరేషలతోపాటు ఉచితంగా అద్దాలను పంపిణీ చేశామని తెలిపారు. నేటి ఈ శిబిరానికి క్యాంపు దాతలుగా కీర్తిశేషులు లయన్ గవ్వల (లడ్డు) లక్ష్మీనారాయణ, కీర్తిశేషులు గవ్వల బాబు (మాజీ వైస్ చైర్మన్) జ్ఞాపకార్థం, వీరి మనవడు గవ్వల చందన్, అల్లుడు బండే బాబు వ్యవహరించడం పట్ల వారు లైన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలుపుతూ, వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వెంకటేష్ కుమార్, గూడూరు మోహన్ దాస్, పళ్లెం వేణుగోపాల్, సాగ సురేష్, పుట్లూరు నరసింహులు, మేటి కల కుళ్లాయప్ప, గోశే రాధాకృష్ణ, ఉట్టి శివప్రసాద్, చందా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


