ఆర్థికంగా చూస్తే, ఈ 1.53 లక్షల మంది కొత్త వితంతు లబ్ధిదారులకు నెలకు రూ. 4,000 చొప్పున పింఛన్ అందించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు సుమారు రూ. 61 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే ప్రభుత్వం ‘స్పౌజ్ కేటగిరీ’ కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే, తక్షణమే ఆ తర్వాతి నెల నుంచి భార్యకు పింఛన్ బదిలీ చేసే ప్రక్రియను అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారా ఇప్పటికే సుమారు 2.30 లక్షల మందికి లబ్ధి చేకూరింది. అయితే 60 ఏళ్ల లోపు ఉండి, స్పౌజ్ కేటగిరీ పరిధిలోకి రాని వితంతువుల నుంచి వస్తున్న విన్నపాల మేరకు ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా వారికి ప్రాధాన్యత ఇస్తోంది.



