కర్ణాటక ప్రయోజనాలు కాపాడుకుంటాం – Visalaandhra
మేకెదాటు ప్రాజెక్టుపై స్పందించిన మంత్రి ప్రియాంక్ ఖడ్గేబెంగళూరు: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసిన మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో శుక్రవారంనాడు కీలక తీర్మానం జరిగింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించింది. తమ రాష్ట్ర ప్రయోజనాలు తాము కాపాడుకుంటామని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖడ్గే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం నా బాధ్యత. వాళ్ల రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్లు (తమిళనాడు) తీర్మానం చేశారు. కోర్టు ఉత్తర్వు చాలా స్పష్టంగా…


