సర్ ప్రక్రియ పై ప్రతి బి ఎల్ ఏ లు అప్రమత్తంగా ఉండాలి


మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : సర్ పై ప్రతిబిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రారంభమైన సర్ ప్రక్రియ పై ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 2002 సంవత్సర ఓటరు జాబితా ప్రామాణికంగా ఈ సర్ ప్రక్రియ జరుగుతున్నది అని, ఇందులో ఉన్న జాబితా ఆధారంగా ఇప్పుడున్న వారి జాబితా వారికి అనుబంధంగా చేర్చటం జరుగుతుందని, ఒకవేళ ఓటరు జాబితా లో ఉన్నవారు ప్రస్తుతం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినా లేదా మరణించినా వారి వివరాలను సంబంధిత బి ఎల్ ఏ లకు తెలియజేయాలని వారు ఏజెంట్లకు తెలపాలన్నారు. ఏదైనా సమస్యలు ఎదురైతే బి ఎల్ ఏ లను సంప్రదించాలని, ఈ ప్రక్రియ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉంటూ నిజమైన ఓటు హక్కును ఎవరూ కోల్పోకుండా చూడాలి అని వారు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *