స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యందు విశేష అనుభవము కలిగిన వైద్య నిపుణుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల మొదటి, మూడవ శుక్రవారం లలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎం సందీప్, ప్రతి నెలలో ప్రతి గురువారం యూరాల జస్ట్ డాక్టర్ దుర్గాప్రసాద్, ప్రతినెల రెండవ బుధవారం చీఫ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మాధవ దేశాయ్, ప్రతి నెల మొదటి శనివారం న్యూరాలజిస్ట్ అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ రాబిన్ గుప్తా, ప్రతినెల రెండవ శుక్రవారం సర్జికల్ గ్యాస్ట్రోస్పెషలిస్ట్ సర్జన్ డాక్టర్ జయదీప్ నేత, ప్రతినెలా నాలుగవ గురువారం ఇమ్యునాలజీ అండ్ రుమటాలజీ డాక్టర్ హరీష్ రోగులకు వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఇటువంటి నిపుణులైన డాక్టర్ల వద్దకు వెళ్లాలంటే వివిధ నగరాలకు వెళ్లేవారని, అలాగాకుండా ప్రజల కోరిక మేరకు తమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ సౌకర్యం కల్పించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో నిష్ణాతులైన వైద్యులచే వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


