ప్రశంసా పత్రాల బహుకరణ… ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు


విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ధర్మవరం అధ్యాపకులకు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల కు చెందిన అధ్యాపకులు శ్రీ బాలాజోషి, శ్రీ కిరణ్ కుమార్ శ్రీ చక్రపాణి రెడ్డి, డా. మల్లికార్జున, కళ్యాణి , అనూష 2026 వ సంవత్సరం నుండి అమలు లో వచ్చే పాలిటెక్నిక్ సిలబస్ సీ-26 తయారీ లో ముఖ్యభూమిక పోషించారు అని తెలిపారు. ఈ సందర్భంగా వారి కృషి కి అభినందిస్తూ ఉన్నత విద్య శాఖ సంచాలకులు, మంగలగిరి వారి నుండి ప్రశంషా పత్రాలు అందాయి అని తెలిపారు. . కళాశాల లో ఉండే అధ్యపకులు నుండి 6 మంది ఇంతటి గొప్ప కార్యక్రమములో పాల్గినడం ఏంతొ గర్వముగ ఉందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో శాఖదిపతులు బాలస్వామి, డా. హరిబాబు, కార్యాలయ పర్యవేక్షకులు సుశీల పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *