రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది: జగన్
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన కీలక హామీలను చంద్రబాబు సర్కార్ పూర్తిగా విస్మరించిందని, వడ్డీ రాయితీ పథకాన్ని నిలిపివేసి మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తోందంటూ ఎక్స్ వేదికగా ఆయన సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఏపీలో పన్ను ఆదాయ వృద్ధి పడిపోయిందని, రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ…


