Last Updated:
కోనసీమ రామచంద్రాపురం గంగవరం మండలంలోని ఆగస్తేశ్వర స్వామి ఆలయంలోకి 5 అడుగుల నాగజెర్రి పాము, భక్తుల్లో భయం, స్నేక్ గణేష్ వర్మ ఆరు గంటల ప్రయత్నంతో బంధించాడు
ఆ జిల్లాలో అగస్తేశ్వర స్వామి లక్షలాది భక్తుల పూజలు అందుకుంటుంటారు. స్వామివారిని ఒక సోమవారమే కాక అన్ని రోజులు భక్తులు దర్శించుకుంటూ ఉంటారు, స్వయంభూ మహాదేవుడు కావడంతో ప్రతిరోజు ఒక పండుగ మాదిరిగా ఆ దివ్య క్షేత్రం విరాజిల్లుతూ ఉంటుంది, అయితే తాజాగా ఆ దివ్య క్షేత్రం గుడిలోకి నాగజెర్రి పాము ప్రవేశించింది.
అంతే ఒక్కసారిగా భయంతో భక్తులు పరుగులు తీశారు. అర్చకులు దేవస్థానం అధికారులు సైతం భయపడిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో స్నేక్ కేచర సైతం అక్కడికి చేరుకుని పామును బంధించేందుకు ప్రయత్నం చేసిన కుదరని పరిస్థితి నెలకొంది, ఇది ముమ్మాటికి మహాదేవుడి సుబ్రహ్మణ్యస్వామి లీలలే అంటూ భక్తులు దైవ నామస్మరణ చేయడం ప్రారంభించారు. స్వామివారి ప్రధాన గడప సైతం తొలగించే పరిస్థితి ఏర్పడింది. చివరికి ఏమైంది అలాంటి దివ్య క్షేత్రం ఎక్కడ ఉంది? ఒకసారి క్లుప్తంగా చూద్దాం.
గోదావరి జిల్లాలకు సంబంధించి కోనసీమ జిల్లాలో రామచంద్రాపురం నియోజకవర్గం గంగవరం మండలంలో ఆగస్తేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం స్వయంభూ దివ్య క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంటుంది, అటువంటి స్వామి వారి దివ్య క్షేత్రంలో, 5 అడుగులు పొడవుగల నాగ జెర్రిపాము ప్రవేశించింది, ఇది చూసిన భక్తులు అర్చకులు సైతం అక్కడి నుంచి పరుగులు తీసి బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. దీంతో ముందుగా ఆపాము దానికదే బయటికి వెళ్లిపోతుంది అని చూసినప్పటికీ దాదాపు సమయం లింగాకారం వద్దే ఉండిపోవడంతో స్నేక్ కాచర్కు సమాచారం అందించారు.
ఎలాంటి పామునైనా కోనసీమ జిల్లాలో స్నేక్ క్యాచార్స్ కేవలం ఒక స్టిక్ సహాయంతో బంధిస్తూ ఉంటారు, కానీ ఈ దివ్య క్షేత్రంలో ఉన్న పామును బంధించేందుకు అలా ప్రయత్నాలు చేసి విసుక్కుపోయారు. చివరికి స్వామి వారి ప్రధాన ధార బంధం సైతం తొలగించే విధంగా ప్రయత్నాలు ప్రారంభించారు . భారీ పాములను సైతం ఇట్టే పట్టే క్యాచ్చర్స్, స్వామి వారి ఆలయంలో ఉన్న పామును బంధించేందుకు మాత్రం భయపడిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. చివరికి స్టిక్ వల్ల సహాయంతో పామును బంధించే ప్రయత్నాలు చేశారు, ఆరు గంటల సమయం కు పైగా శ్రమించి ఈ పామును స్నేహ గణేష్ వర్మ బంధించారు.
కోనసీమ జిల్లాలో ఎంతో చరిత్ర కలిగిన ఆగస్తేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో నాగజెరి సర్పం రావడం ఇది ముమ్మాటికీ మహాదేవుడు సుబ్రహ్మణ్యస్వామి లీలలే అంటూ భక్తులు పేర్కొన్నారు, పాము కనిపించకుండా పోవడం పరుగులు తీయించడం లాంటి తరుణంలో సైతం అక్కడున్న భక్తులు ఓం నమశ్శివాయ నామస్మరణ చెబుతూ ఉండిపోయారు. మహాదేవ ఇక ఇబ్బందులు పెట్టకు అన్న విధంగా భక్తులు ఏకతాడిగా భగవంతుని ప్రార్థించారు దాదాపు సమయం తర్వాత, ఒక వల సహాయంతో స్నేక్ క్యాచర్ ఆ పామును బంధించి అక్కడ నుంచి తరలించారు.
వేసవి తాపానికి నీళ్ల కోసం వస్తున్న పాములు భూగర్భంలో నీటి ప్రాంతంలో ఉండే పాములు వేసవి వేడి తట్టుకోలేక అంతకుమించి, నీటి కోసం బయటికి వస్తున్నాయని స్నేక్ కేచర్స్ పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో సమీప ప్రాంతంలో చెరువులు లేదా చెత్తా చదరాలు ఉన్న ప్రాంతాల్లో పాములు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తలు వహించాలంటూ స్నేక్ క్యాచర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


