చిత్తూరు జిల్లా, కుప్పం నియోజక వర్గం, శాంతిపురం మండలానికి చెందిన సోమశేఖర్ అనే రైతన్న తన పొలంలో విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు చేస్తున్నాడు.చామంతి పూల తోటలను విద్యుత్ వెలుగులతో పూల సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు ఈ రైతన్న సవాలుగా మారిన వాతావరణ పరిస్థితుల నుంచి చామంతిని కాపాడుకుంటూ పొలమంతా విద్యుత్ కాంతులను నింపి పంట దిగుబడితో సేద్యంలో రాణిస్తున్నాడు. వేల సంఖ్యలో వెలుగుతున్న బల్బులతో పువ్వుల సాగు చేస్తున్నాడు.ఇలా సాగు ఎందుకుచేస్తారు.. ఇలా చేస్తే రైతులకు లాభం ఏమిటి..??? అనే విషియాలు రైతన్న లోకల్ 18 ద్వారా వివరించారు.
Source link


