తీర ప్రాంత ప్రజలకు కారిడార్ ముప్ప్పు
గుల్ల కాంతారావు ఒక పని తలపెట్టినప్పుడు దాని పర్యవసానాలను ముందుగానే అంచనా వేయాలి. మంచిచెడులను ఆలోచించాలి. విచక్షణ, సంయమం అనేవి వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా తప్పనిసరి. ఇవి లోపించినప్పుడు, ఆ నిర్ణయాల దుష్పరిణామాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం సహజ వనరుల వినియోగం పేరుతో తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ఇదే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కార్పొరేట్లకు అనుకూలంగా మారుతున్న విధానాల కారణంగా బీచ్ శాండ్ మినరల్స్ తవ్వకాల విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో పెను ముప్పుగా మారే…


