మిత్రుడి వర్ధంతి లో అన్నదాన కార్యక్రమం..


25వ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్
విశాలాంధ్ర ధర్మవరం; మాజీ 25వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ ప్రియ మిత్రుడు కీర్తిశేషులు కొమ్మూరు మల్లికార్జున రెడ్డి మృతి చెంది సంవత్సరమైన సందర్భంగా ప్రథమ వర్ధంతి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిపి మేడాపురం వెంకటేష్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించడం జరిగిందని మేడాపురం వెంకటేష్ తెలిపారు. అనంతరం మేడాపురం వెంకటేష్ మాట్లాడుతూ నా ప్రియమిత్రుడు మృతి చెంది సంవత్సరం కావడం బాధాకరమని, అతని ఆత్మ శాంతి కొరకు ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని వారు తెలిపారు . అనంతరం సాయిబాబా గుడి అధ్యక్షులు సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో రావులచెరువు ప్రతాపరెడ్డి, నారాయణరెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి ,హుస్సేన్ రాజు లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *