ఉచిత యోగ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి..


యోగా అసోసియేషన్, సాంస్కృతిక మండలి
విశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత యోగ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని యోగా గురువులు గాజుల సోమేశ్వర్ రెడ్డి, కట్టా రవి కుమార్, సాంస్కృతిగా మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో గల సింధూర్ నిత్య ధ్యాన యోగా కేంద్రం.. కళా జ్యోతి సర్కిల్, శివ సాయి యోగా కేంద్రం శివానగర్ యశోద కిడ్స్ కాన్సెప్ట్ స్కూల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద మే 1వ తేదీ నుండి మే 31 వ తేదీ వరకు ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఏడున్నర గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుండి 6:30 గంటల వరకు ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున యోగా పట్ల ఆసక్తి అభివృద్ధి కలిగిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను వెంట వచ్చి ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *