సామాన్యుడిలా ప్రజల మధ్యకు.. కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు పనితీరుపై ప్రజల ప్రశంసలు! bandaru satyananda rao wins fourth time in kottapeta called god. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

అంబేద్కర్ కోనసీమ కొత్తపేటలో నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వినయం, సేవతో ప్రజల మనసులు గెలుచుకుని, వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు

+

News18

News18

ఏపీలో ఒక జిల్లా ఉంది… అక్కడ ప్రజలు మాత్రమే కాదు, నాయకులు సైతం ఒక ఎమ్మెల్యేను చూసి గర్వపడుతున్నారు. మా మంచి ఎమ్మెల్యే అని ప్రేమతో పిలుచుకుంటూ, ఆయన మా ఇంటి బిడ్డ అని పెద్దలు చెప్పుకుంటుంటే.. యువత మాత్రం ఏ సమస్య వచ్చినా మా సార్ ఉన్నారు అంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ ప్రేమ, ఈ నమ్మకం ఒక్క రోజులో రాలేదు.. ఆయన చూపిన వినయ విధేయత, సేవా తత్వమే ఆ స్థాయికి తీసుకెళ్లింది.

గోదావరి జిల్లాలంటేనే ఆప్యాయతకు, అనురాగాలకు ప్రతీక. అలాంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు రాజకీయ హోదా ఎంత ఉన్నా.. ప్రవర్తన మాత్రం సాధారణ మనిషిలానే ఉంటుంది. నియోజకవర్గంలో జరిగే ప్రతి చిన్న పెద్ద కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. శుభకార్యాలు, కష్టసమయాలు.. ఏ సందర్భమైనా సమాచారం ఇస్తే చాలు, ఆ కుటుంబ సభ్యుడిలా అక్కడికి చేరుకుంటారు. సమస్య అయితే నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి, ఆ కుటుంబానికి కొండంత అండగా నిలుస్తారు.

ఇటీవల ఏపీలో తిరుపతి తర్వాత మరో తిరుపతిగా పేరు తెచ్చుకున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్ర అభివృద్ధి వెనక కూడా బండారు సత్యానందరావు కృషి ఎంతో ఉందని భక్తులు చెబుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ఈ క్షేత్రం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుకుంటోంది. ఒక సాధారణ భక్తుడిలా ప్రతిరోజూ స్వామివారి సేవలో పాల్గొంటూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈవోతో కలిసి స్వయంగా పర్యవేక్షణ చేస్తుండటం ఆయన ప్రత్యేకత.

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పే ఉదాహరణగా నిలుస్తున్నారు బండారు సత్యానందరావు. తన గురువులు, పెద్దలు ఎక్కడ కనిపించినా వెంటనే పాదాభివందనం చేస్తూ ముందుకు వెళ్లడం ఆయన అలవాటు. నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచినా… ఎక్కడా అహంకారం కనిపించదు. తాజాగా జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కనిపించగానే వారికి పాదాభివందనం చేసి, “విద్యా వైద్యం ప్రజలకు పూర్తిస్థాయిలో అందాలి మాస్టారు” అంటూ ప్రత్యేకంగా మాట్లాడటం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

ఈ టెక్నాలజీ యుగంలో కూడా వినయం, విధేయత, సేవా భావంతో ముందుకు సాగుతున్న బండారు సత్యానందరావు వంటి నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని గోదావరి ప్రజలు చెబుతున్నారు. అందుకే ఆయనను ఎమ్మెల్యేగా కాదు.. దేవుడిలా భావిస్తూ గుండెల్లో పెట్టుకుంటున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *