మామిడి పండ్ల కోసం వాహనాలు ఆపివేసిన ప్రయాణికులు, ట్రాఫిక్ అంతరాయం.
తూర్పుగోదావరి జిల్లా: వేసవిలో మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లో రుచి సరిగా లేకపోవడం గమనార్హం. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో చెట్టుపై పండిన మామిడి పండ్లను కోసి, చెక్క బల్లలపై పేర్చి అమ్ముతున్నారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రత్యేక దృశ్యం కనిపిస్తోంది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా మామిడి దిగుబడి తగ్గింది. అయినప్పటికీ, రహదారి వెంట అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నాయి. వాహనదారులు, బాటసారులకు…


