రక్త బంధం, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ వెల్లడి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఎన్జీవో హోం లో నిర్వహించిన రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని రక్త బంధం ట్రస్ట్, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం తో పాటు
రజిని ట్రస్ట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణ ప్రజలు సహకారంతో నిర్వహించామని తెలిపారు. ముఖ్య అతిథులు గా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సీనియర్ సభ్యులు, రిటైర్డ్ అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు, అడ్వకేట్ సుమలత, తాడిపత్రి సేవా బ్లడ్ బ్యాంక్ వారి సిబ్బంది రావడం జరిగింది అన్నారు. ఈమెగా రక్తదాన శిబిరంలో దాదాపు 29 మంది రక్తదానం చేసి విజయవంతం చేయడం జరిగిందని తెలియజేశారు అలాగే రక్తదాతలకు జ్ఞాపకం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు సమాజ సేవకులు కేత లోకేష్ చంద్రశేఖర్ రెడ్డి, జయ ప్రకాష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు


