నియోజకవర్గాల బిల్లుపై తమిళనాడు సీఎం నిరసన.. నడిరోడ్డుపై కాపీల దహనం
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బిల్లు కాపీని స్వయంగా దహనం చేసి తన వ్యతిరేకతను బలంగా చాటారు. ఈ బిల్లును ‘నల్ల చట్టం్ణగా అభివర్ణించిన ఆయన, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా, తమిళనాడులోని ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ కోరారు. చెన్నై గోపాలపురంలోని దివంగత…


