ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, బాలిక ఉన్నారు.
Source link
Kurnool Road Accident: మంత్రాలయం సమీపంలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 13 మందికి గాయాలు


