నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించండి.. – Visalaandhra


జాయింట్ కలెక్టర్ భరద్వాజకు వినతి పత్రం అందజేసిన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా.
విశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి; రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా, జాయింట్ కలెక్టర్ భరద్వాజకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐవైఎఫ్ రాష్ట్ర పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ మెగా డీఎస్సీను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పారిశ్రామిక ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరిచారని వారు తెలిపారు. అంతేకాకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఎస్సై పోస్టులకు వయోపరిమితిని పెంచాలని వారు తెలిపారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ భరద్వాజ మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *