విశాలాంధ్ర – నార్పల:- మండల పరిధిలోని నాయనపల్లి గ్రామంలోని సుంకలమ్మ ఆలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల మేరకు, వెంకటాంపల్లి గ్రామానికి చెందిన బాలరాజు (45) (తండ్రి: ఓబులేసు) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ప్రమాదంలో ఆయన కుమారుడు ప్రవీణ్ (21) గాయపడ్డాడు. గాయపడిన ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
The post తండ్రిని బలిగొన్న ప్రమాదం.. గాయాలతో బయటపడ్డ కుమారుడు appeared first on Visalaandhra.


