తమిళ చిత్ర రంగంలోకి అడుడిడుతోన్న బాలివుడ్ భామ
హైదరాబాద్: పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ధనుశ్ త్వరలో ‘కర’ సినిమాతో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెలలోనే కర సినిమా విడుదలకాబోతోంది. దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ‘డీ 56’ (నిర్మాణ పేరు)గా పట్టాలెక్కబోతోన్న ఈ చిత్రంలో ధనుశ్‌తో అందాల తార రుక్మిణీ వసంత్ జోడీ కట్టనున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. పలు చిత్రాలతో బీజీగా ఉన్న రుక్మిణికి డేట్స్ కుదరకపోవడంతో ఈ చిత్రాన్ని అంగీకరించలేకపోయింది. అయితే…ఇప్ప్పుడు రుక్మిణి స్థానంలో బాలివుడ్ యువ కథానాయక, దురంధర్ ఫేమ్ సారా అర్జున్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. దురంధర్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సారాను ఇప్ప్పుడా పాత్ర కోసం ఎంపిక చేసే పడింది చిత్ర బందం. అన్నీ అనుకూలిస్తే…ఆమె మొదటి తమిళ చిత్రం ఇదే అవుతుందని తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారికి ప్రకటన వచ్చే వరకూ ధనుశ్ సరసన ఆ చిత్రంలో నటిస్తారనేది సందేహంగానే ఉంది.


